Bangalore, maratahalli నుంచి around 90 km దూరంలో ఉన్న దేవరాయణదుర్గ గుడి, ప్రకృతి ఒడిలో ఒదిగిన కొండపైన, చల్లని పిల్లగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
రోజులు గడిచే కొద్ది, మనుషుల జీవితాలు యాంత్రికం అవుతున్నాయి. రోజు రోజుకు మనలో దైవభక్తీ కూడా తగ్గిపోతుంది. సరేలెండి ఇది ఇలా ఉండగా, ఒక రోజు గుడికి వెళదాం అనుకున్నాను. అప్పుడు Bangalore దగ్గరలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలను చూపించమని మన గురువు gooleని అడిగాను. Address note చేసుకొని, నా roommate మరియు నేను bike మీద దేవరాయణదుర్గ బయలుదేరాము.
Internet లో దేవరాయణదుర్గ around 60 km దూరంలో ఉన్నట్టు చూపించింది. మేము వెళుతున్నాం వెళుతున్నాం, మద్యలో కొందరిని అడిగితే ఇలాగే వెళ్ళండి అని చెవుతున్నారు.
అలా కొంత దూరం వెళ్ళాక ఒక school లో పిళ్లాడు లిఫ్ట్ అడిగాడు. సేర్లే వాడు పక్క ఉూరివాడు అయి ఉంటాదులే, దారి చూపిస్తాడు అని bike ఎక్కించు కున్నాం. వాడితో మాట్లాడితేగానీ తెలియలేదు, వాడికి తెలుగు, ఇంగ్లీష్ రావని, మాకేమో కన్నడ రాదు. కిందమీద పడి వాడికి అర్దం అయ్యేలా 'మీవూరు ఎంత దూరం అని'. దానికి వాడు 'స్వల్ప దూర' అన్నాడు. ఎంత దూరం వెల్లినా వాడు 'ముందుకోగి స్వల్ప దూర' అనే అంటున్నాడు.
అలా ఉూరులు, ఉూరులు దాటిపోతున్నాం, కానీ వాడి వూరు మాత్రం రావటంలేదు. మకోమో లేనిపోని doubts వస్తున్నాయి, school నుంచి పారిపోయి వస్తున్నాడేమొ, వీడు వాళ్లావూరు వెళుతున్నాడ లేక ఇంక ఎక్కడకన్నా వెళుతున్నాద... ఇలా అనేక ఆలొచెనలు వస్తున్నాయి.
రోజూ ఎండలు ఎక్కువ ఉండేవే ఆరోజు మాత్రం చల్లగావుంది, road కూడా straight గా ఉంది (చిన్న చిన్న మలుపులు తప్ప). road పక్కన సీతాఫలాలు కువ్వలు కువ్వలు... పోసి అమ్ముతున్నారు, దారిలో చెరువులు, పూల తోటలు వాటి మీదుగా వచ్చే చల్లని గాలులు, అలా drive చేసుకుంటూ వెళుతున్నాం..
దేవాలయం కొండమీద ఉంది. కోండి మీదకు వెళుతున్నాం, bike speed నెమ్మదిగా తగ్గుతుంది 60,50,40... చివరికి 10 కి చేరుకుంది ఎంత raise చేసినా లాబంలేదు. 150 cc bike, కొండ ఎక్కుతున్నాం కదా అందువల్లలే slow గా వెళుతుంది అనుకున్నాను. ఇంతలో నా పక్కనుంచి ఒక 150 cc bike రైమని వెళ్ళింది. ఒరినీ ఆ bike లో power చాలా బాగుంది అనుకున్నాను. ఇంకొంచెం చేపటికీ 100 cc bike మీద మీద ముగ్గురు వెళుతున్నారు (మా bike తొలగేసి). ఓరి నీ అది bikeకా లేక ఇంకేమన్ననా అనుకున్నాను. మవాడు అన్నాడు ఓరే...! నీ bike 'ఆడుతూ పడుతూ' movie లో bus లా ఉంది అన్నాడు.. Bike ని కాసేపు ఆపి, start చేసి ఒక్కొక్క bike ను తొలగేస్తూ వెళ్ళాము.


























No comments:
Post a Comment