Saturday, 15 March 2014

Journey (ప్రయాణం)



       ప్రయాణం అంటే కొందరికి మహా సరదా, మరి కొందరికి మహా చిరాకు. మరి నా విషయానికి వస్తే ప్రయాణం అంటే పడి చచ్చిపోను కానీ, window seat లో కూర్చొని భయటి పచని చెట్లును చూస్తూ, చల్లగాలిని ఆస్వాదించటం అంటే ఇస్టం.


       ఒక రోజు సింగరాయకొండ నుంచి బెంగుళూరుకు ticket book చేసుకున్నాను, కానీ window seat దొరకలేదు.  bus full గా ఉండటం వలన last నుంచి 3వ line లో seat దొరికింది, వేరే దారీలేక book చేసుకున్నాను.


       ఆరోజు సింగరాయకొండలో bus ఎక్కాను, నాతోపాటు ఆరుగురు bus ఎక్కి last seats లో కూర్చున్నారు. వాళ్ళలో నలుగురు ఫుల్లుగా తాగిఉన్నారు. వాళ్ళు చూడ్డానికి పెద్ద వెదవలులా ఉన్నారు. తాగి ఉన్నారుకదా bus ఎక్కినప్పటినుంచి గొడవ చెయ్యటం మొదలుపెట్టారు.


       వారి గొడవకు బస్ లోని వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. ఎందుకంటే రోజులు మంచివికావు, కొద్ది రోజుల క్రితం ఒక sadist గాడు, busలో నిద్రిస్తున్న వాళ్ళను అమానుషంగా చంపి పారిపోయాడు. ఆ సంగటనతో చాలామంది బస్ ప్రయాణం అంటేనే భయపడిపోయారు.

       ఇప్పుడు bus లోని వాళ్ళని అరుద్దాం అంటే అందరికి భయం, ఎందుకంటే అరిస్తే వాళ్ళు ఏమీ చేస్తారోఅని.ఎవరికి వాళ్ళు భయం తో కామ్‌గా కూర్చున్నారు. ఎంతగా భయపడుతున్నారు అంటే, ఎందుకు వచ్చిన గొడవ బస్ దిగిపోదాం బతికి ఉంటే బలుసాకు తిని ఐనా బతకవచు అనెంతగా. bus లో వాళ్ళను చూసి నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే అదే అమాయకుడు కొంచెం sound చేస్తేనే తలొక తిట్టూ తిడతారు, వీలైతే కొట్టనైనా కొడతారు.

      Bus నెల్లూరులో ఒక hotel దగ్గర ఆపి భోజనం చేసేవాళ్ళు వెళ్ళి చెయ్యండి బస్ ఒక 10 min ఆగుతుంది, అన్నాడు driver. నేను వెళ్ళి tiffin చేసి వచ్చేసరికి, bus లోని వాల్లుఅంతా గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. ఒకరు అంటున్నారు ఏంటి ఇలాంటీ వాళ్ళను bus ఎక్కిస్తరు అసలే రోజులు మంచివి కావు, మరొకరు వీల్లని చూస్తే sadist లా ఉన్నారు తాగిన మైకంలో ఎమిచేస్తారో ఎమో, వీల్లని bus లోనుంచి దింపమని conductor కి చెవుదాము, ఇలా మాట్లాడుకుంటున్నారు.



     Conductor రానే వచ్చాడు, పాపం వాడికి తెలియదు వాడే ఆటలో అరటిపండు అని. తలోపక్క తగులుకొని వాయించేశారు, ఇలాంటి వాళ్ళను ఏందుకు ఎక్కించుకున్ణావు దింఛెయ్యండి అని. Conductor కి ఏమీ చెయ్యాలో తెలియక, "నేను ఏందుకు ఎక్కించుకున్నాను మీరు ఎలా ticket book చేసుకున్నారో వాళ్ళు అలానే చేసుకున్నారు. వాళ్ళను తిని రానివ్వండి గోడచెయ్యద్దు అంది చెవుతను, ఐనా గొడవ చేస్తే దించేస్తాను" అన్నాడు conductor.

     అందరూ తిని వచ్చేశారు, ఆ ఆరుగురు తప్ప. అందరూ వాళ్ళకోసం ఎదురుచూస్తున్నారు, వాళ్ళు ఎంతకీరారే...! ఇంతలో conductor వచ్చి అందరూ వచ్చారా..! అని అడిగాడు. అంతలో ఒకడు అన్నాడు ఆ ఆరుగురు VIP లు ఇంకా రాలేదు. ఇందాక BAR ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, బహుశా అక్కడికే వెల్లివుంటారు అన్నాడు. Bus లో వాళ్ళు గొడవ చెయ్యటం మొదలు పెట్టారు, వాళ్ళను వదిలేసి వెళదాంఅని. Conductor ఏమో బయపడుతున్నాడు, వాళ్ళను వదిలి వెళితే తన job కి problem అవుతూందేమో అని. "నాజీవితంలో ఇటువంటి situation ఎదురు కాలేదు" అని conductor అన్నాడు.


     ఇంతలో ఆ ఆరుగురిలో, నలుగురు road మీద వస్తూ కనిపించారు మిగిలిన ఇద్దరికి మందు సరిపోలేదో లేక తాగి పడిపోయరో తెలియదు కానీ వాళ్ళు రాలేదు. ఆ నాలుగురిలో ఒకడు మాత్రం తాగలేదు. మిగిలిన ముగ్గురు ఫుల్లుగా తాగారు. రోడ్ ని ఆ చివరి నుంచి ఈ చివరికి కొలతలు వేస్తూ, వచ్చే పోయే వాహనాల మీద పడుతూ లేస్తూ వస్తున్నారు.
     వాళ్ళు bus ఎక్కటంతో అందరూ silent అయ్యారు. Conductor వచ్చి ఆ నలుగురితో, "మీరు గొడవ చేస్తున్నారు అని అందరూ compliant చేస్తున్నారు. మీరు గొడవ చేస్తే police station వద్ద bus ఆపుతను అని warning ఇచ్చాడు. మందు తాగని వాడు ఇలా అన్నాడు "సార్ మాకు బెంగుళూరు లో painting పని ఉందని మా మేస్త్రీ  phone చేసి చెప్పాడు అందుకే వెళుతున్నాం కొంచెం మా వాళ్ళు వచ్చే వరకు ఆగింది అన్నాడు. వాడి మాటలకు జాలి వేసి కొంచెం సేపు ఎదురు చూశారు ఎంతకూ రారే...!

    Bus లో వాళ్ళు conductor ని కోప్పాడటంతో bus start చేశారు. Bus start అయ్యిందో లేదో, మన వాళ్ళు (ఆ నలుగురు) గొడవ start చేశారు. నీవల్లే ఇలా జరిగింది, నీవల్లే ఇలా జరిగింది... అని పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వారిగోడవకి, పక్క seat లో వాళ్ళు మా seat మార్చండి లేకుంటే మేము దిగి పోతాం అని conductor తో గొడవ చేశారు. కండక్టర్ వాళ్ళకు ముందు seat ఇచ్చాడు. మిగిలిన వాళ్ళు కూడా మా seat మార్చు లేదంటే మేము దిగి పోతాం అన్నారు.

    ఈ దెబ్బకి conductor కి ఏమీ చెయ్యాలో తెలియక తళపట్టుకు కూర్చున్నాడు. ఇక్కడ విషయం ఏమిటి అంటే అందరు conductor ని అంటున్నారే కానీ, గొడవ చేసేవారిని ఏమీ అనటంలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారు అని భయం.

    ఇది అంతా చూసి నాకు తిక్క రేగింది. ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకొని, "ఓయ్..! తిక్క తిక్క గా ఉందా ఏంటి, బుస్‌లో ఉండాలి అంటే కామ్ గా ఉండండి లేకుంటే దిగి పొండి" అని గట్టిగా గార్దించాను, గొడవ చేసే ఆ నలుగురిని . ఆ అరుపుకు ఒక్కసారిగా silent ఐపోయారు.
     ఆ అరుపుకి, నేను అయ్యాను ఆటలో అరటిపండు. ఎందుకు అంటే "అందరు నేను చాలా ధైర్యవంతుడను అని అనుకున్నారు". నా వెనుక వాళ్ళు భయం వేస్తుంది అని నన్ను request చేసి నా seat లో కూర్చున్నారు, తప్పక వాళ్ళ seat లో నేను కూర్చున్నాను. అప్పుడు ఆ తాగిన వాళ్ళు నావెనుక seat లోనే ఉన్నారు. ఇక చూడండి నా పరిస్తితి.... అసలే వాళ్ళు తాగి ఉన్నారు, నామీద కోపంగా కూడా ఉన్నారు ఏమి చేస్తారో.... నా పీక వాళ్ళకు బాగా అందుతుంది కోపంలో పిసికేస్తారో ఏమో.... ఇలా అనుకుంటూ నిద్రపోయాను.

     ఏముందన్ది ఈ రోజుల్లో ప్రాణం అంటే అందరికీ చులకనే. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మరి.
    

No comments:

Post a Comment