Saturday, 22 March 2014

Second Show


        రెండు రోజులనుంచి సరిగా నిద్రలెకో ఏమో కానీ, ఈరోజు బాగా నిద్ర పట్టింది. నిద్ర లేచే సరికి, రూమ్ లో ఉన్న ఇద్దరు చెరో laptop కి అంటుకుపోయారు. ఒకడెమో facebook మరొకడు u-tube. లేచిన వాడిని కుదురుగా ఉండక, tiffin సంగతి ఏమిటి అని అడిగాను. అడిగిన పాపానికి tiffin order ఇచ్చి తీసుకురమ్మని నన్ను బయటికి నెట్టారు.

       Morning time కదా, parcel కి ఎంత time పడుతుందో అనుకుంటూ వెళ్ళాను. Hotel కలీగా ఉంది. అబ్బ న time బాగుంది అనుకుని, మూడు మసాలా దోసెలు parcel అన్నాను. వాడు నా వైపు ఎగాదిగా చూసి, ఈ time లో tiffin ఏంటి సార్ వేడి వేడిగా మీల్స్ ఉంది తీసుకో అన్నాడు. అప్పుడు కానీ నాకు అర్దం కాలేదు 12 PM అయ్యిందని. వచ్చాను కదా అని మీల్స్ తీసుకొని వెళ్ళాను.

       తిని, సిస్టమ్ లో చూసిన సినిమాని మళ్లీ ఓ రౌండ్ వేశాం. సాయంత్రం 7 అయ్యింది. చూసిన సినిమా చూసి bore కొట్టింది . అప్పుడు అందరం కలిసి 2nd show సినిమా కి వెళ్దాం అనుకున్నాం. అసలే శనివారం మరియు మార్నింగ్ నుంచి న time బాగోలేదు , "దరిద్రుడు తాడుని పట్టుకుంటే పాము ఐనట్టు" నేను online లో చెక్ చేస్తే tickets దొరుకుతయొ లేదో అని, రూమటే ని check చేయమన్నాను.  తాను check చేసి tickets  ఉన్నై అన్నాడు, ఇంకెముంది త్వరగా book చెయ్ అని అందరు ఒక్కసారి అన్నాం. tickets book ఐపోయాయి.

      Movie theater దగ్గరకు వెళ్లేసరికి జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు. లోపలకు వెళ్లే దారిలో online tickets పట్టుకుని ఒక అతను కూర్చుని ఉన్నాడు. తన దగ్గరకు వెళ్ళి మొబైల్ మెసేజ్ చూఇంచి tickets అడిగాము వెంటనే tickets ఇచ్చాడు.అవి తీసుకుని theater లో కూర్చున్నాం.

      Movie start అయ్యింది. ఇంతలో ఒక నలుగురు వచ్చి ఈ seats మావి అన్నారు. Seat numbers కూడా చూసుకోవడం రాదా అన్నాడు మాలో ఒకడు. వాళ్ళు ticket numbers చూఇంచి ఈ seats మావి అన్నాడు, మేము కూడా మా tickets చూఇంచి మావి కూడా అవే నంబర్స్  వెళ్ళి theater వాళ్ళని అడుగు అన్నాం.

      Theater వాళ్ళు పెద్ద పనికిమలినా వాళ్ళులా ఉన్నారు  ఒకే seat numbers ను ఇద్దరికి ఇచ్చారు అనుకుంటున్నాం. ఇంతలో theater వాళ్ళు వచ్చి మీ tickets చూఇంచు అన్నారు. మాకు పట్టారని కోపం వచ్చింది, tickets తో పాటు mobile message కూడా చూఇంఛాం. వాడు అధి చూసి బాబు ఈ టికెట్స్ ఈరొజువి  కాదు రేపటీవి, ఈరొజుకివెళ్ళి రేపు సాయంత్రం రండి అన్నాడు. ఆ మాటకి, మా తలలు ఎక్కడ పెట్టుకోవాలో అర్దం కాలేదు. Tickets book చేసినవాడి వైపు గుర్రుగా చూసి బయటకు వెళ్ళిపోయాం. ఏమీ చేద్దామండి ఆ రోజు మా దరిద్రం అలా ఎచ్చింది.

No comments:

Post a Comment