Thursday, 27 February 2014

Thottikal Falls (TK Falls) Bangalore



        ఒక రోజు రూమ్ లో ఇద్దరమే ఉన్నాము. నేను నిద్ర లేచేసరికి తాను system కి అంటుకుపోయాడు. నాకేమో bore కొడుతుంది. Movie కి వెళదాం అంటే అన్ని చూసినవే. పోనీలే system లో చూద్దాం అంటే అందులో ఉన్నవి అన్ని 3 or 4 times చూసేసాను.

         బయట ఏమో ఎండ ఎక్కువగా ఉంది. ఏదైన water falls కి  వెళితే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగాను వాళ్ళు సరే, దగ్గరలో ఏదైనాఆ water falls ఉంటే చెప్పు అన్నారు. Ok మన google గురు ఉంది కదా check చేసి చెవుతను అని phone cut చేశాను.

        Google లో search చేసినప్పుడు 30 km distance లో Thottikal falls (TK Falls) చూఇంచింది. వాటిలో sample photos.


       ఇంకెముంది దారి మద్యలోని కొన్ని place ల పేరులు గుర్తుపెట్టుకొని, bike, camera మరియు bag అందులో టవల్... ready చేసుకొని start అయ్యం. కొంత దూరం వెళ్ళాక (around 15 km), దారిలోని ఒక  shop లో అడిగాం TK Falls కు వెళ్లే దారి ఇదేనా అని. అందుకు తాను 'TK Falls ఆ ఆది ఎక్కడ ఉంది' అన్నాడు. మాలోమెము అందరికి ఎలా తెలుస్తుంది లే అనుకుని స్టార్ట్ అయ్యం.

       ఇంకొంత దూరం వెళ్ళాక దారిలో కనిపించిన ఒకతనిని "TK Falls కి దారి ఇదేనా" అని అడిగాం. తాను కూడా "అది ఎక్కడ" అన్నాడు. ఇలా కాదు అని Thottikal కి దారి ఇదేనా అంటే అవును అన్నాడు. ఇలా అడిగిన ప్రతిసారీ మాకు షోక్ ఇస్తున్నారు.


       వెళ్ళి వెళ్ళి.... చివరికి Thottikal చేరుకున్నాం, అది ఒక పల్లెటూరు. ఆఉూరిలో వాళ్ళకు తెలుగు రాదు మాకు కన్నడ రాదు. మాకు తెలిసిన భాషా, సైగలతో వాళ్ళను అడిగము (water falls కి ఎలా వెళ్ళాలి అని), వాళ్ళకు తెలిసిన భాషా, సైగలతో వాళ్ళు బదులిచ్చారు. చిన్నగా వారి సైగలు అర్దం చేసుకొని TK Falls చేరుకున్నాం.


          అక్కడ వాటర్ ఫాల్స్ లేవు, కొండలు, బండలు మరియు గుంటలలో మురికి నీళ్ళు తప్ప. ఒకరి మొకము ఒకరం చూసుకొని నవ్వుకున్నాం. ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే, వర్షా కాలంలో తప్ప మిగతా సమయంలో water ఉండదు. అప్పుడు మేము అనుకున్నాం గుడ్డిగా photos చూసి వెళ్ళకూడదు కొంచం దానిగురించి తెలుసుకొని వెళ్ళాలి అని నిట్తూర్చాము.










         

Tuesday, 25 February 2014

Nandi Hills(Bangalore)



            Nandi hillsలో కొండల మద్య సూర్యోదయమును, చేతికందే మబ్బులను, ఒళ్ళు పులకరించే ప్రకృతి సొగసులు చూసేందుకు వివిద ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రెమికులు ఇక్కడికి వస్తారు.

           Nandi hills, నంది హిల్స్ గురించి అనేక కథలు ఉన్నాయి. చోళుల కాలంలో Nandi hills ని ఆనంద గిరి అని పిలిచేవారని. యోగ నందీశ్వర ఇక్కడ తపస్సునాచరించారని అందువలన ఆపేరు వచ్చింది అంటారు ఒక కథ. ఈ కొండ పై ఉన్న 1300 సంవత్సరాల ద్రావిడ శైలిలో ఒక పురాతన ఆలయం నుండి ఈ పేరు వచ్చిందని మరొక సిద్ధాంతాలు ఉన్నాయి.




           చాలా రోజులనుంచి వెలదాము అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఒక రోజు సాయంత్రం friend call చేశాడు, 'రేపు morning 4:30 am కి ready గా ఉండు మనం Nandi hills వెళుతున్నాం  అన్నాడు'. ఇంతకీ ఎంతమంది వస్తున్నారు అని అడిగాను. 10 మంది వరకు రావచ్చు అని బదులిచ్చాడు. అంత మంది ఐతే ఏమన్నా problem అవుతూందేమో అన్నాను. అదేమీ కాదులే 4:30 కి రెడీగా ఉండు అని phone cut చేశాడు.

           నేను ఉండే place నుంచి Nandi hills around 70 km ఉంటుంది,  bikes మీద వెళదాం అనుకున్నాం. అసలే కొండ ప్రాంతం, friend తో వచ్ఛేవాళ్ళు అందరు కొత్తవాల్ళే, వారి గురించి నాకు తెలియదు. Rash drive చేస్తారోమో అనుకున్నాను.brother ను అడిగాను, nandi hills వెళుతున్నాం నువ్వు కూడా వస్తావా అని. తాను సరే అన్నాడు. ఇంతకీ అంత పొద్దునే వాళ్ళు వస్తారా అన్నాడు, వస్తే వెళదాం లేకుంటే లేదు అనుకుని పడుకున్నాం.

           పొద్దునే phone మొగుతుంది. బద్దకంగా లేచి phone pick చేశాను  ఆ call friend దగ్గరనుంచి. call pick చేసిన వెంటనే సుప్రభాతం start చేశాడు, 'ఓరే..! ఇంకా లేవలేదా...! మేము ready అయ్యి నీ కోసం ఎదురుచూస్తున్నాము. తొందరగాలే లేచి రెడీ అవ్వు వెలదాము' అని. వెంటనే లేచి మా బ్రదర్ ని లేపడమ్ స్టార్ట్ చేశాను. అసలే చలికాలం కదా ముసుగు తన్ని పడుకున్నాడు. వాడిని లేపేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది.

           మొత్తానికి 5 am కి start అయ్యాము. కొంత దూరం వెళ్ళాక, brother అన్నాడు "అటు చూడు వాళ్ళు ఏమి తీసుకువస్తున్నారో". ఒక bike ఫైన ఉన్న వాళ్ల మద్యలో పెద్ద కర్రల సంచీ ఉంది. అందులో బీర్ బోటెల్స్ ఉన్నట్టు ఉన్నట్టున్నాయి. వాళ్ళు తాగి గోల చేస్తారోమో అనిపించింది. అదే విషయం friend ని అడిగాను. 'అరె స్వామి ఆది తినడానికి తీసుకువచ్చిన పులిహొర' అని నవ్వుతూ బదులిచ్చాడు, అవునా...! అని నాలుకకరిచాను.


           అలా వెళుతూఉన్నాం, ఒక్కొక్కరూ ఎంత speed గా వెళుతున్నారు అంటే.... 40 km కూడా దాటటంలేదు. కొంత సమయం చూసి, 'అరే బాబు ఇలా ఐతే మనం సాయంకాలంకు కూడా వెళతామోలెదో, కొంచం speed పెంచండి' అన్నాను. దానికి బదులుగా వాళ్ళు అన్నారు, 'speed వద్దు slow గానే వెళదాం. ఏమన్నా జరగకుడనిది జరిగితే పరిస్తితి ఏమిటి?' అన్నారు. కనీసం 50 km అన్న వెళదాం అన్నాను. దానికి వాళ్ళు సరే అన్నారు.

 

              Nandi hills వచ్చేసరికి అందరూ పరిచయం అయ్యారు. Nandi hills కొండ కింద traffic jam అయ్యింది. ఏంటి అని ఆరా తీస్తే, కొండ కింద check post పెట్టారు. కొండమీదకి వెళ్లే వాళ్ళ బండి documents check చేస్తున్నారు. పొద్దునే ఎవడు ఉంటాడులే అని, మాలో కొందరు documents తీసుకురాలేదు. crowd ఎక్కువగా, check చేసేవాళ్ళు తక్కువగా ఉండటం వలన తప్పించుకున్నాం.



                కొండమీదకు ఎక్కే సమయంలో, కొంత దూరం వెళ్ళాక నా బండి slow అవుతూ 40km కి చేరుకుంది. ఎంత rise చేసిన 40 కంటే పోవటం లేదు. అది కొత్త బండి 2 service లే అయ్యాఇ, దానికి అప్పుడపుడ్ తిక్క రేగుతుంది, దాని గురించి చెప్పాలిఅంటే పెద్ద స్టోరీ అవుతుంది దానిగురించి మారోపోస్ట్ చేస్తాను. bike ఆపి showroom వాడిని ఒక రౌండ్ వేసుకొని. మళ్లీ స్టార్ట్ చేశాను కొంత సేపటికీ మామూలుగా అయ్యింది. మొత్తానికి కొండమీదకు చేరుకున్నాం.


 
  
 
 
 
 
 
 
 

          ప్రకృతి అందాలను ఆస్వాదించి. తెచ్చుకున్న పులిహొర తిని, తిరిగి వచ్చాము.ఈ టూర్ వచ్చిన అందరికి థాంక్స్. స్పెషల్ థాంక్స్ టు విజయ్, ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మరియు అమ్మ చేతి కమ్మటి పులిహొర తినిపించినందుకు.

Thursday, 20 February 2014

My First International Travel


       ఇది నాకు మొదటి విమాన ప్రయాణం, India నుంచి Philippines (Bangalore to Thailand - Thailand to Philippines). ఈ ప్రయాణం లో నేను ఏమీ excite కాలేదు కానీ, ఇది నాకు Good experience. 2013-12-14 న బెంగుళూరు airport లో స్టార్ట్ అయ్యాను. 
  

         విమానం లోని seats, Bus లో లాగే ఉన్నయీ. Push back కూడా ఉంది, నేను ఫ్రీగా పడుుకుందాం అని seat ని వెనుకకు అన్నానో లేదో, వెంటనే Air Hostess వచ్చి బాబు వెనుక వాళ్ళకి ఇబ్బింది గా ఉంటుంది కొంచెం నీ seat  ను ముందుకు అనుకోవ అంది. విమానం లో ఫ్రీగా పడుకోవడానికి కూడా వీల్లెద అన్నట్టు చిరాకుగా తనవైపు చూసి seat ని ముందుకు అనుకున్నాను. 


            విమానం start అయ్యింది, announcement చేస్తున్నారు (Please wear seat-belt. Please turn off all your electronic devices. Please switch off  your mobile or put it in flight mode.). నేను నా మొబైల్ని flight mode ఉంచి వీడియో తీస్తున్నాను.  Air Hostess వచ్చి switch off  చైమని చెప్పింది. Mobile flight mode లో ఉంది అన్నాను. ఐన సరే flight take-off అయ్యెంతవరకు switch off చెయ్యాలి అంది, వెంటనే switch off చేశాను.

         అటు ఇటు చూస్తూ వెనుకకు తిరిగాను నా వెనుక seats కాలీగావున్నవి, అందులో ఒక Air Hostess కూర్చొని mobile లో చాట్ చేస్తుంది. ఆది చూసి నేను, "రూల్స్ పక్కవారికే కానీ మనకుకాదు" అని మనసులో అనుకుని కామ్‌గా కూర్చున్నాను.

          విమానం రన్‌వే మీద స్పీడ్‌గా వెళుతూ ఒక్కసారిగా గాలిలోకి లేచింది. విమానం పైకి వెళుతుంటే, 'చిన్ననాటి అట్లతద్ది రోజు, పెద్ద ఉూయలలో పెద్ద పెద్ద ఉూపులు ఉూగుతున్నా అనుభూతి కలిగింది'. విమానం పైకి వెళ్లేకొద్ది, నేలమీది పెద్ద భవనాలు చిన్న చిన్నవై పోతున్నవి.


         విమానం take off అయ్యింది. ఆ సమయంలో, ఆగి ఉన్న విమానంలో కూర్చుంటే ఎలా ఉంటుదో అలానే ఉంది. కిటికీలోంచి బయటకు చూశాను, ఎంతో ఆహ్లాదంగా ఉంది. చేతికి అందె మబ్బుల మద్యనుంచి విమానం వెళుతుంటే, మబ్బులలో తేలుతున్నట్టు అనిపించింది.


       Thailand దగ్గరకు వచింది. ఒక్కసారిగా విమానం లో కుదుపులు మొదలైనవి. విమానం ఒక్కసారిగా పడిపోతున్నట్టు వెంటనే పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటిసారి అందరు ఉలిక్కి పడ్డారు కానీ తరువాత తాపీగా కూర్చూనివున్నారు. కుదుపులకు వీళ్ళకి మైండ్ పొఇన్ద ఏమిటి ఇంత తాపీగా ఉన్నారు అనుకొన్నాను. ఏమైంది విమానం ఇలా ఉూగుతుంది అని పక్కతనిని అడిగాను తాను ఇలా అన్నాడు 'ఆఇది అంతా మామూలే సముద్రం లో పెద్ద పెద్ద నీటి బుడగలు ఉంటాయీ, అవి ఉన్నపుడు భూమి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అప్పుడు విమానం కిందకు పడిపోతుంది. అవి దాటాక మామూలుగా ఉంటుంది అప్పుడు పైకి లేస్తుంది, అందుకే ఇలా ఉూగుతుంది'. ఇది నిజమో కాదో తెలియదుకాని, అదే పెద్ద బుడగ వస్తే మన పని గోవింద అని మనసులో అనుకున్నాను.

        దీనికి తోడు విమానం లాండ్ అవడానికి సిగ్నల్ దొరకక, ఏర్‌పోర్ట్ చుట్టూ రెండు రౌండ్లు వేసింది. సిగ్నల్ దొరకగానే తక్కువ దూరం నుంచి ఒక్కసారిగా  లాండ్ అయ్యేసరికి, నాకు మట్టి రోాడ్‌లో ఎడ్లబండి మీద వెళుతున్నట్టు అనిపించింది.


          Thailand to Philippines విమానం కోసం 3 అవర్స్ airport లో ఉన్నాను. ఆసమయంలో ఏర్‌పోర్ట్ అంతా ఒక రౌండ్ వేశాను.

 

          Philippines విమానం వచ్చింది ఎక్కాను, Philippines లో దిగాను. Toilet కు వెళ్ళాను అక్కడి బేసిన్లు చాలా కిందకు ఉన్నవి (మోకాళ్ళ వరకే), వీళ్ళకు మైండ్ ఉందా లేదా ఇంత కిందకు పెట్టారు అనుకున్నాను. అక్కడి మనుషులను చూసిన తరువాత కానీ అర్దంకాలేదు, వాళ్ళకు కాళ్లు చాలా పొట్టి బాడీ చాలా పొడవు.

          Airport నుంచి, Makati లోని ఒక Hotel కి వెళ్ళాను.


            Hotel పక్కనే ఒక పార్క్ ఉంది, అది Christmas season కావటంతో, సాయంత్రం సమయంలో programs జరిగేవి. కాలీగా ఉన్నపుడు వెళ్ళి చూసేవాడిని.