Thursday, 27 February 2014

Thottikal Falls (TK Falls) Bangalore



        ఒక రోజు రూమ్ లో ఇద్దరమే ఉన్నాము. నేను నిద్ర లేచేసరికి తాను system కి అంటుకుపోయాడు. నాకేమో bore కొడుతుంది. Movie కి వెళదాం అంటే అన్ని చూసినవే. పోనీలే system లో చూద్దాం అంటే అందులో ఉన్నవి అన్ని 3 or 4 times చూసేసాను.

         బయట ఏమో ఎండ ఎక్కువగా ఉంది. ఏదైన water falls కి  వెళితే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగాను వాళ్ళు సరే, దగ్గరలో ఏదైనాఆ water falls ఉంటే చెప్పు అన్నారు. Ok మన google గురు ఉంది కదా check చేసి చెవుతను అని phone cut చేశాను.

        Google లో search చేసినప్పుడు 30 km distance లో Thottikal falls (TK Falls) చూఇంచింది. వాటిలో sample photos.


       ఇంకెముంది దారి మద్యలోని కొన్ని place ల పేరులు గుర్తుపెట్టుకొని, bike, camera మరియు bag అందులో టవల్... ready చేసుకొని start అయ్యం. కొంత దూరం వెళ్ళాక (around 15 km), దారిలోని ఒక  shop లో అడిగాం TK Falls కు వెళ్లే దారి ఇదేనా అని. అందుకు తాను 'TK Falls ఆ ఆది ఎక్కడ ఉంది' అన్నాడు. మాలోమెము అందరికి ఎలా తెలుస్తుంది లే అనుకుని స్టార్ట్ అయ్యం.

       ఇంకొంత దూరం వెళ్ళాక దారిలో కనిపించిన ఒకతనిని "TK Falls కి దారి ఇదేనా" అని అడిగాం. తాను కూడా "అది ఎక్కడ" అన్నాడు. ఇలా కాదు అని Thottikal కి దారి ఇదేనా అంటే అవును అన్నాడు. ఇలా అడిగిన ప్రతిసారీ మాకు షోక్ ఇస్తున్నారు.


       వెళ్ళి వెళ్ళి.... చివరికి Thottikal చేరుకున్నాం, అది ఒక పల్లెటూరు. ఆఉూరిలో వాళ్ళకు తెలుగు రాదు మాకు కన్నడ రాదు. మాకు తెలిసిన భాషా, సైగలతో వాళ్ళను అడిగము (water falls కి ఎలా వెళ్ళాలి అని), వాళ్ళకు తెలిసిన భాషా, సైగలతో వాళ్ళు బదులిచ్చారు. చిన్నగా వారి సైగలు అర్దం చేసుకొని TK Falls చేరుకున్నాం.


          అక్కడ వాటర్ ఫాల్స్ లేవు, కొండలు, బండలు మరియు గుంటలలో మురికి నీళ్ళు తప్ప. ఒకరి మొకము ఒకరం చూసుకొని నవ్వుకున్నాం. ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే, వర్షా కాలంలో తప్ప మిగతా సమయంలో water ఉండదు. అప్పుడు మేము అనుకున్నాం గుడ్డిగా photos చూసి వెళ్ళకూడదు కొంచం దానిగురించి తెలుసుకొని వెళ్ళాలి అని నిట్తూర్చాము.










         

No comments:

Post a Comment