Nandi hillsలో కొండల మద్య సూర్యోదయమును, చేతికందే మబ్బులను, ఒళ్ళు పులకరించే ప్రకృతి సొగసులు చూసేందుకు వివిద ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రెమికులు ఇక్కడికి వస్తారు.
Nandi hills, నంది హిల్స్ గురించి అనేక కథలు ఉన్నాయి. చోళుల కాలంలో Nandi hills ని ఆనంద గిరి అని పిలిచేవారని. యోగ నందీశ్వర ఇక్కడ తపస్సునాచరించారని అందువలన ఆపేరు వచ్చింది అంటారు ఒక కథ. ఈ కొండ పై ఉన్న 1300 సంవత్సరాల ద్రావిడ శైలిలో ఒక పురాతన ఆలయం నుండి ఈ పేరు వచ్చిందని మరొక సిద్ధాంతాలు ఉన్నాయి.
చాలా రోజులనుంచి వెలదాము అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఒక రోజు సాయంత్రం friend call చేశాడు, 'రేపు morning 4:30 am కి ready గా ఉండు మనం Nandi hills వెళుతున్నాం అన్నాడు'. ఇంతకీ ఎంతమంది వస్తున్నారు అని అడిగాను. 10 మంది వరకు రావచ్చు అని బదులిచ్చాడు. అంత మంది ఐతే ఏమన్నా problem అవుతూందేమో అన్నాను. అదేమీ కాదులే 4:30 కి రెడీగా ఉండు అని phone cut చేశాడు.
నేను ఉండే place నుంచి Nandi hills around 70 km ఉంటుంది, bikes మీద వెళదాం అనుకున్నాం. అసలే కొండ ప్రాంతం, friend తో వచ్ఛేవాళ్ళు అందరు కొత్తవాల్ళే, వారి గురించి నాకు తెలియదు. Rash drive చేస్తారోమో అనుకున్నాను.brother ను అడిగాను, nandi hills వెళుతున్నాం నువ్వు కూడా వస్తావా అని. తాను సరే అన్నాడు. ఇంతకీ అంత పొద్దునే వాళ్ళు వస్తారా అన్నాడు, వస్తే వెళదాం లేకుంటే లేదు అనుకుని పడుకున్నాం.
పొద్దునే phone మొగుతుంది. బద్దకంగా లేచి phone pick చేశాను ఆ call friend దగ్గరనుంచి. call pick చేసిన వెంటనే సుప్రభాతం start చేశాడు, 'ఓరే..! ఇంకా లేవలేదా...! మేము ready అయ్యి నీ కోసం ఎదురుచూస్తున్నాము. తొందరగాలే లేచి రెడీ అవ్వు వెలదాము' అని. వెంటనే లేచి మా బ్రదర్ ని లేపడమ్ స్టార్ట్ చేశాను. అసలే చలికాలం కదా ముసుగు తన్ని పడుకున్నాడు. వాడిని లేపేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది.
మొత్తానికి 5 am కి start అయ్యాము. కొంత దూరం వెళ్ళాక, brother అన్నాడు "అటు చూడు వాళ్ళు ఏమి తీసుకువస్తున్నారో". ఒక bike ఫైన ఉన్న వాళ్ల మద్యలో పెద్ద కర్రల సంచీ ఉంది. అందులో బీర్ బోటెల్స్ ఉన్నట్టు ఉన్నట్టున్నాయి. వాళ్ళు తాగి గోల చేస్తారోమో అనిపించింది. అదే విషయం friend ని అడిగాను. 'అరె స్వామి ఆది తినడానికి తీసుకువచ్చిన పులిహొర' అని నవ్వుతూ బదులిచ్చాడు, అవునా...! అని నాలుకకరిచాను.
అలా వెళుతూఉన్నాం, ఒక్కొక్కరూ ఎంత speed గా వెళుతున్నారు అంటే.... 40 km కూడా దాటటంలేదు. కొంత సమయం చూసి, 'అరే బాబు ఇలా ఐతే మనం సాయంకాలంకు కూడా వెళతామోలెదో, కొంచం speed పెంచండి' అన్నాను. దానికి బదులుగా వాళ్ళు అన్నారు, 'speed వద్దు slow గానే వెళదాం. ఏమన్నా జరగకుడనిది జరిగితే పరిస్తితి ఏమిటి?' అన్నారు. కనీసం 50 km అన్న వెళదాం అన్నాను. దానికి వాళ్ళు సరే అన్నారు.
Nandi hills వచ్చేసరికి అందరూ పరిచయం అయ్యారు. Nandi hills కొండ కింద traffic jam అయ్యింది. ఏంటి అని ఆరా తీస్తే, కొండ కింద check post పెట్టారు. కొండమీదకి వెళ్లే వాళ్ళ బండి documents check చేస్తున్నారు. పొద్దునే ఎవడు ఉంటాడులే అని, మాలో కొందరు documents తీసుకురాలేదు. crowd ఎక్కువగా, check చేసేవాళ్ళు తక్కువగా ఉండటం వలన తప్పించుకున్నాం.
కొండమీదకు ఎక్కే సమయంలో, కొంత దూరం వెళ్ళాక నా బండి slow అవుతూ 40km కి చేరుకుంది. ఎంత rise చేసిన 40 కంటే పోవటం లేదు. అది కొత్త బండి 2 service లే అయ్యాఇ, దానికి అప్పుడపుడ్ తిక్క రేగుతుంది, దాని గురించి చెప్పాలిఅంటే పెద్ద స్టోరీ అవుతుంది దానిగురించి మారోపోస్ట్ చేస్తాను. bike ఆపి showroom వాడిని ఒక రౌండ్ వేసుకొని. మళ్లీ స్టార్ట్ చేశాను కొంత సేపటికీ మామూలుగా అయ్యింది. మొత్తానికి కొండమీదకు చేరుకున్నాం.
ప్రకృతి అందాలను ఆస్వాదించి. తెచ్చుకున్న పులిహొర తిని, తిరిగి వచ్చాము.ఈ టూర్ వచ్చిన అందరికి థాంక్స్. స్పెషల్ థాంక్స్ టు విజయ్, ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మరియు అమ్మ చేతి కమ్మటి పులిహొర తినిపించినందుకు.





No comments:
Post a Comment