Thursday, 20 February 2014

My First International Travel


       ఇది నాకు మొదటి విమాన ప్రయాణం, India నుంచి Philippines (Bangalore to Thailand - Thailand to Philippines). ఈ ప్రయాణం లో నేను ఏమీ excite కాలేదు కానీ, ఇది నాకు Good experience. 2013-12-14 న బెంగుళూరు airport లో స్టార్ట్ అయ్యాను. 
  

         విమానం లోని seats, Bus లో లాగే ఉన్నయీ. Push back కూడా ఉంది, నేను ఫ్రీగా పడుుకుందాం అని seat ని వెనుకకు అన్నానో లేదో, వెంటనే Air Hostess వచ్చి బాబు వెనుక వాళ్ళకి ఇబ్బింది గా ఉంటుంది కొంచెం నీ seat  ను ముందుకు అనుకోవ అంది. విమానం లో ఫ్రీగా పడుకోవడానికి కూడా వీల్లెద అన్నట్టు చిరాకుగా తనవైపు చూసి seat ని ముందుకు అనుకున్నాను. 


            విమానం start అయ్యింది, announcement చేస్తున్నారు (Please wear seat-belt. Please turn off all your electronic devices. Please switch off  your mobile or put it in flight mode.). నేను నా మొబైల్ని flight mode ఉంచి వీడియో తీస్తున్నాను.  Air Hostess వచ్చి switch off  చైమని చెప్పింది. Mobile flight mode లో ఉంది అన్నాను. ఐన సరే flight take-off అయ్యెంతవరకు switch off చెయ్యాలి అంది, వెంటనే switch off చేశాను.

         అటు ఇటు చూస్తూ వెనుకకు తిరిగాను నా వెనుక seats కాలీగావున్నవి, అందులో ఒక Air Hostess కూర్చొని mobile లో చాట్ చేస్తుంది. ఆది చూసి నేను, "రూల్స్ పక్కవారికే కానీ మనకుకాదు" అని మనసులో అనుకుని కామ్‌గా కూర్చున్నాను.

          విమానం రన్‌వే మీద స్పీడ్‌గా వెళుతూ ఒక్కసారిగా గాలిలోకి లేచింది. విమానం పైకి వెళుతుంటే, 'చిన్ననాటి అట్లతద్ది రోజు, పెద్ద ఉూయలలో పెద్ద పెద్ద ఉూపులు ఉూగుతున్నా అనుభూతి కలిగింది'. విమానం పైకి వెళ్లేకొద్ది, నేలమీది పెద్ద భవనాలు చిన్న చిన్నవై పోతున్నవి.


         విమానం take off అయ్యింది. ఆ సమయంలో, ఆగి ఉన్న విమానంలో కూర్చుంటే ఎలా ఉంటుదో అలానే ఉంది. కిటికీలోంచి బయటకు చూశాను, ఎంతో ఆహ్లాదంగా ఉంది. చేతికి అందె మబ్బుల మద్యనుంచి విమానం వెళుతుంటే, మబ్బులలో తేలుతున్నట్టు అనిపించింది.


       Thailand దగ్గరకు వచింది. ఒక్కసారిగా విమానం లో కుదుపులు మొదలైనవి. విమానం ఒక్కసారిగా పడిపోతున్నట్టు వెంటనే పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటిసారి అందరు ఉలిక్కి పడ్డారు కానీ తరువాత తాపీగా కూర్చూనివున్నారు. కుదుపులకు వీళ్ళకి మైండ్ పొఇన్ద ఏమిటి ఇంత తాపీగా ఉన్నారు అనుకొన్నాను. ఏమైంది విమానం ఇలా ఉూగుతుంది అని పక్కతనిని అడిగాను తాను ఇలా అన్నాడు 'ఆఇది అంతా మామూలే సముద్రం లో పెద్ద పెద్ద నీటి బుడగలు ఉంటాయీ, అవి ఉన్నపుడు భూమి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అప్పుడు విమానం కిందకు పడిపోతుంది. అవి దాటాక మామూలుగా ఉంటుంది అప్పుడు పైకి లేస్తుంది, అందుకే ఇలా ఉూగుతుంది'. ఇది నిజమో కాదో తెలియదుకాని, అదే పెద్ద బుడగ వస్తే మన పని గోవింద అని మనసులో అనుకున్నాను.

        దీనికి తోడు విమానం లాండ్ అవడానికి సిగ్నల్ దొరకక, ఏర్‌పోర్ట్ చుట్టూ రెండు రౌండ్లు వేసింది. సిగ్నల్ దొరకగానే తక్కువ దూరం నుంచి ఒక్కసారిగా  లాండ్ అయ్యేసరికి, నాకు మట్టి రోాడ్‌లో ఎడ్లబండి మీద వెళుతున్నట్టు అనిపించింది.


          Thailand to Philippines విమానం కోసం 3 అవర్స్ airport లో ఉన్నాను. ఆసమయంలో ఏర్‌పోర్ట్ అంతా ఒక రౌండ్ వేశాను.

 

          Philippines విమానం వచ్చింది ఎక్కాను, Philippines లో దిగాను. Toilet కు వెళ్ళాను అక్కడి బేసిన్లు చాలా కిందకు ఉన్నవి (మోకాళ్ళ వరకే), వీళ్ళకు మైండ్ ఉందా లేదా ఇంత కిందకు పెట్టారు అనుకున్నాను. అక్కడి మనుషులను చూసిన తరువాత కానీ అర్దంకాలేదు, వాళ్ళకు కాళ్లు చాలా పొట్టి బాడీ చాలా పొడవు.

          Airport నుంచి, Makati లోని ఒక Hotel కి వెళ్ళాను.


            Hotel పక్కనే ఒక పార్క్ ఉంది, అది Christmas season కావటంతో, సాయంత్రం సమయంలో programs జరిగేవి. కాలీగా ఉన్నపుడు వెళ్ళి చూసేవాడిని.


 

No comments:

Post a Comment