Thursday, 15 January 2015

USA Travel


         కొద్ది రోజుల్లో నేను USA వెల్లబోతున్నాను, ఇది చలికాలం కనుక USA temperature చాలా తక్కువగా ఉంటుంది. వింటర్ clothes ఉన్నప్పటికీ ఆ వాతావరణం నాకు పడుతుందో లేదో అనుకుంటున్నాను. ఇంతలోనే USA వెళ్లే రోజు రానే వచ్చింది. అన్ని వస్తువులు ప్యాక్ చేసి సిద్దంగా ఉంచుకున్నాను.

         27-12-2014 00:00:01 ఆత్తంటి నరసింహం (కుడి వైపు) తో కలసి నేను ట్యాక్సీలో airportకి బయలుదేరాను. వెళ్ళేదారిలో ఉన్నాం సురేష్ (ఎడమ వైపు) join అయ్యాడు. వెళ్ళేదారిలో చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుని నవ్వుకుంటూ airportకి చేరుకున్నాము. 

For More Images: Click Here

           నరసింహం, సురేష్ తో కలసి కొంతసేపు ఉన్నాను, తరువాత బోర్డింగ్ పాస్ తీసుకుని airportలోకి వెళ్ళాను. Flightలో బెంగుళూరు to దోహా, దోహా to చికాగో (USA), చికాగో to డెన్‌వర్ కి చేరుకోవాలి. బెంగుళూరులో స్టార్ట్ ఐన, నాలుగున్నర గంటలకు దోహా చేరాను అప్పటికీ తెల్లవారింది. తరువాతి విమానంకు కొంత సమయం ఉన్నదున, విమానాశ్రయం అంతా ఒక రౌండ్ వేశాను.

 For More Images: Click Here

          దోహా విమానాశ్రయంలో ఉదయం 7:00 కి బయలుదేరాను, దోహా నుంచి చికాగో కి 14:30 గంటలు టైమ్ పడుతుంది. Flight take off అయ్యింది, నాది విండొ సీట్ బయటకు చూస్తూ కూర్చున్నాను. బయటి వాతావరణం మబ్బులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. విమానం సముద్రా లను, ఉూరులను,కొండలను మరియు ఎడారులను దాటుకుంటూ అలా వెళుతుంది. కొంత సేపటికీ బ్రేక్ ఫాస్ట్ వచ్చింది, తిని మూవీ చూడటం మొదలుపెట్టాను. ఎండ ఎక్కువ కావటం వల్ల windowని క్లోస్ చేశాను.




For More Images: Click Here 

Videos: Clouds
 
              Snow Hills


             View From the plain:

              కొన్ని గంటల తరువాత విండొ తీశాను, అంతే floodlight on వెసినట్టు లైటింగ్ పడుతుంది వెంటనే close చేశాను. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకొన్ని గంటల తరువాత విండొని కొంచం open చేసి చూశాను, బయట మిట్ట మధ్యానం ఉన్నట్టు ఉంది. మరికొన్ని గంటల తరువాత అదే పరిస్తితి. ఎన్ని గంటలు ఐనా మధ్యానం లాగే ఉంది. అప్పుడు కానీ నాకు అర్దం కాలేదు, విమానం సూర్యుడికీ సమాంతరంగా వెళుతుంది అని. చికాగో కాలమానం ప్రకారం 3:00 PM flight లాండ్ అయ్యింది.

            చికాగో విమానాశ్రయం చాలా పెద్దది, ఎంత పెద్దది అంటే ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్ కి వెళ్లటానికి train ఉంది. బయటి వాతావరణం ఏలావుందో చూద్దాం అని విమానాశ్రయం నుంచి బయటికి వచాను. చలి గడ్డకట్టేలావుంది, ఆ రోజు temperature -4* ఉంది.



Video: Runway


           చికాగో నుంచి డెన్‌వర్ విమానాశ్రయంకి చేరుకున్నాను,అక్కడనుంచి Longmontలోని Hotelకి వెల్లాలి. విమానాశ్రయం నుంచి ట్యాక్సీ కోసం బయటికి వచ్చాను. చలి చాలా ఎక్కువగా ఉంది నేను చేతికి gloves వేసుకోలేదు పోనీ చేతులు జేబులో పెట్టుకుందాం అంటే లగేజి ఉంది. కొద్ది సేపటికే ట్యాక్సీ ఎక్కాను, అప్పటికే చేతులు గడ్డకట్టాయి. కార్ లో హీటర్ ఉండటం వల్ల హాయిగా ఉంది, బయట రోడ్ ఇరువైపులా మంచుతో కప్పేసి ఉంది. రోడ్ మీది మంచును ట్రక్ లతో క్లీన్ చేస్తున్నారు. ఇది నాకు కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఇది సర్వసాదారణం. అన్నట్టు ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఇది మీకు తెలిసే ఉండవచ్చు. Hotelకి చెరుకొనెసరికి నైట్ 1:00 అయ్యింది. Hotelని చెక్కతో కట్టారు, ఇక్కడ ఇల్లు కట్టటానికి ఎక్కువగా చెక్కనే ఉపయోగిస్తారు. మొత్తం మూడు ఫ్లోర్స్ ఉన్నాయి (ground floor, First floor and Second floor), Hotel మొత్తం హీటర్స్ ఉన్నాయి.

For More Images: Click Here

Video: Snowing


            Snow road

              Snow:


            ఉదయాన్నే మేలుకువ వచ్చింది, లేచి కిటికీ curtains open చేశాను. బయటి వాతావరణం చాలా బాగుంది (చూడ్డానికి మాత్రమే అప్పుడు బయటి temperature -12). చుట్టూ మంచు, దగ్గరలో మంచుతో కప్పబడిన కొండలతో చాలా అందంగా ఉంది. ఆ కొండలను చూస్తుంటే, పాల కొండలు అంటే ఇలానే ఉంటయేమో అనిపించింది.

            నేను రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ కోసం కిందకి బయలుదేరాను (గ్రౌండ్ ఫ్లోర్ లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది), ఒక అతను(US అతను) నాకు ఎదురుగా వస్తున్నాడు. అతను నావైపు చూసి చిరునవ్వుతో hi అన్నాడు. ఒక్క క్షణం ఎవరు ఇతను నాకు hi చెవుతున్నాడు అనుకుని, వెంటనే తేరుకొని బదులుగా ఒక చిరునవ్వు విసిరి hi morning అని ముందుకు వెళుతున్నాను ఇంతలో ఒక అమ్మాయి యెదురయి hello.. morning అంది చిరునవ్వుతో, నేనుకూడా morning అని ముందుకు వెల్లాను. వాల్లుకూడా అదే hotelలో వుంటున్నారు. ఇలా ఎదురుపడ్డాపుడు, లిఫ్ట్ లో వెళ్ళేటపుడు మరియు టిఫిన్ చేసేటపుడు పలకరించడం సహజం, పరిచేయం ఉన్నా లేకున్న. మొదట వింతగా ఉన్నప్పటికీ తరువాత అలవాటైంది.


For More Images: Click Here

          బ్రేక్‌ఫాస్ట్ కి నాన్ వెజ్ కూడా ఉంటుంది, కానీ నేను తినను ఎందుకంటే ఆది చికెన్, మటన్ లేక ఫిష్ కాకుండ వేరే ఏదో మాంసం. అందుకె నేను తినడానికి ధైర్యం చెయ్యలేదు. లంచ్ లేక డిన్నర్ లో ఎప్పుడన్నా చికెన్, ఎక్కువగా వెజ్ తినేవడిని. నాకు చికెన్ తినాలి అనిపించేదికాదు ఎందుకంటే ఇక్కడి వంటలలో ఉప్పు కారం ఉండవు దానికీతోడు మాంసాన్ని గ్రైండ్ చేసి వండుతారు దాంతో రుచి అస్సలు తెలియదు. నా hotel గదిలో, వంట గది అందులో వంటసామాను ఉన్నాయి. అప్పుడపుడు నైట్ టైమ్ లో అన్నం, కూర చేసుకొనే వాడిని. వండేటపుడు గాటైన వాసనలు, ధట్టమైన ఆవిరిలు రాకుండా చూసుకొనేవాడిని. లేకుంటే fire alarm మొగుతుంది.

         బయటి Temperature మాత్రం చాలా తక్కువగా ఉంటుంది -10,-15,-16 ఇలా ఉంది. ఐనప్పటికీ నాకేమీ అంత ఇబ్బంది అనిపించలేదు. hotelలో, కార్ లో, ఆఫీస్ లో హీటర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే +1,+2.. ఉన్నపుడే ఎక్కువ చలిగా ఉండేది, ఎందుకంటే మైనస్ డిగ్రీస్ ఉంటే మన చర్మం గ్రహించలేదు కానీ వింటర్ క్లాత్స్ తోపాటు ముతికి గుడ్డలేకుండా బయటికి వెళితే కొంత సేపటికీ గాలి పీల్చలేము.

          నేను వెళ్ళిన మొదటి రెండు వారాలు చలి చాలా ఎక్కువగా వుంది. మనది పొడి వాతావరణం, ఇక్కడ గాలిలో తేమ ఎక్కువ అందువల్ల నా ముక్కులో తడి ఆరిపోయి నెత్తురు చిన్న చిన్న పొక్కులు కట్టేది. ఒక రోజు ఐతే నెత్తురు వచ్చింది, ఇలా జరుగుతుంది ఏమి బయపడకు అని నా స్నేహితుడు ముందే చెప్పాడు.

--------ఇంకాఉంది

Sunday, 4 January 2015

సీతయ్యకు తాతయ్య



      ఓ రోజు (Oct-2014) రాత్రి TV చూస్తూ ఉన్నాను, టైమ్ చూసేసరిసి 11:30 అయ్యింది. TV off చేసి పడుకున్నను. అప్పుడు మేడ పైనుంచి పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి. అవి f..k u, f....f..., Kill you, మరియు గట్టిగా door వేస్తున్న శబ్దం.

      బిల్డింగ్ లో రెండు floor లు ఉన్నాయి (Ground floor and first floor) నేను first floor లో ఉంటాను. మేడ మీద సింగల్ రూమ్ ఉంది. అందులో ఒకతను ఉంటాడు(bachelor) తన పేరు మార్క్., call-center లో పనిచేస్తున్నాడు, ఇంగ్లీష్ తప్ప వేరే బాష రాదు. తనకు Ground floor లో ఉండే ఒక family లోని రోహిత్ తో పరిచయం (ఫ్రెండ్) ఉంది.

      ఆ అరుపులు విని నేను బయటకు వచ్చాను. పక్కింటి వాల్లుకూడా బయటకు వచ్చారు. ఏమి జరుగుతుందా అని మేము మెడ మీదకు వెళ్ళాము. మార్క్ ఏమో బిల్డింగ్ పైకి ఎక్కి పిట్ట గోడకు ఆనుకొని ఉన్నాడు. తన ఫ్రెండ్ రోహిత్ room బయట ఉన్నాడు, room లో ఒక అమ్మాయి ఉంది.

      ఏంటి గొడవ అని రోహిత్ ని అడిగాను. దానికి బదులుగా ఫ్యామిలీ ప్రాబ్లమ్ అని సమాదానం ఇచ్చాడు. ఆ సమాదానం విని నాకు మైండ్ పోంది (విడెబ్బ వీడికి పెళ్ళి కాకుడాం ఫ్యామిలీ ఎలావాచ్చిందా అని). పిట్ట గోడకు ఆనుకొని ఉన్న మార్క్ ని చూస్తుంటే కింద పడిపోయేలా ఉన్నాడు, నీ దుంప తెగ కిందకు రారా అంటే ఎంతకూ రాడే. ఎంత కోపంగా అరిసిన తనకు చీమ కుట్టినట్టు కూడా లేదు (సీతయ్య సినిమా చూపించాడు). చివరకు రోహిత్ వాళ్ళ నాన్న వచ్చి అరిస్తే కానీ వినపడలేదు సీతయ్యకి. మార్క్ కిందకు వస్తూనే పెద్దగా అరుస్తూ మొదలెట్టాడు బూతు పురాణం (f..king lady lefty me in the middle of the MG road.... i will kill her....), అందరూ ఉన్నారు అన్న ఇంకిట జ్ఞానం లేకుండా. అప్పుడు కానీ అర్దం కాలేదు మాకు మన గురుడు drugs తీసుకున్నాడు అని.

      అసలు ఏమి జరిగిందా అని ఆరా తీస్తే, Room లో ఉన్న అమ్మాయి(మేరీ) మన సీతయ్య(మార్క్) లవర్. ఇద్దరూ కలసి పబ్ కి వెళ్లారు, అక్కడ ఇద్దరకు గొడవ జరిగింది. సీతయ్యకు శివాలెత్తి మేరీ ని కొట్టాడు. అంతే మేరీ కోపంతో అక్కడనుంచి ఒక్కటే రూమ్ కి వచ్చింది. తనను వదిలి ఒక్కటే వచ్చింది అని, మార్క్ శివ తాండవం చేస్తున్నాడు.

      Room లో ఉన్న మేరీ, బయట జరుగుతున్న గొడవకు బయపడి bag తీసుకుని కిందకి వెళ్ళి పోంది. తన కోసం మార్క్ వెళ్లాడు. అంతే పంచాయతి రోడ్ కి ఎక్కింది. చుట్టుపక్కలవాళ్లు మెడ మీదనుంచి చూస్తున్నారు అప్పటికీ నైట్ 12:30 అయ్యింది. మార్క్ మేరీ ని ఆపటానికి try చేస్తున్నాడు, తను వినిపించుకోవటంలేదు. Sorry మేరీ నీకు కోపంగా ఉంటే నన్ను కొట్టు. beat me, beat me, ....... beat me అంటూ. మేరీ కోపంతో, పోకిరీ మూవీ లో మహేష్ బాబులా ఒక్కటిఇచ్చింది. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి కింద పడబోయి తామాయిన్చుకున్న మార్క్. మళ్ళీ మొదలెట్టాడు, common beat me, beat me...అంటూ (మేరీ చెయ్యి తీసుకొని తన చెంప మీది కొట్టుకుంటూ).

      అది చూస్తున్న మాకు ఏమి చెయ్యాలో అర్దం కాక ఒకరి మొకం ఒకరం చూసుకుని నవుుకున్నాం. మార్క్ ప్రవర్తన ఎలాఉందంటే సైకో అంటే ఇలానే ఉంటాదేమో అనిపించింది మాకు. రోడ్ లో ఏంటి మీగోడవ అందరు చూస్తున్నారు అనెసరికి వాళ్ళు మెడపైకి వెళ్ళడానికి ప్రయత్నిచారు. మేడమీదకి వెళితే మన సైకో ఆ అమ్మాయిని ఏమి చేస్తాడో అని, మేము వెళ్లనివ్వకుండా ఈ రాత్రికి రోహిత్ వాళ్ల ఇంట్లో ఉండమన్నము (అక్కడ ఐతే అందరూ ఉంటారు అని). అందుకు మార్క్ ససేమిరా ఒప్పుకోలేదు. బలవంతంగా ఇద్దరిని రోహిత్ ఇంట్లోకి పంపి, హమ్మయ్య గొడవ సద్దుమణిగింది అని మేము వెళ్ళిపోయాము.

      ఇంటి డోర్ పెట్టి పడుకోబొతున్నాను, ఇంతలో పెద్ద శబ్దం మరియు అరుపులు. ఏమి జరుగుతుందా అని పరుగు పరుగున రోహిత్ వాళ్ళ ఇంటివైపు వెళ్ళాను. అందరు నుంచుని చూస్తున్నారు, ఏమి జరిగిందా అని ఇంట్లోకి వెళ్ళి చూశాను. మార్క్ నిలబడి ఉన్నాడు, మొహం అంతా నెత్తురు కారుతుంది. మేరీని మేడమీదకు తీసుకొని వెళ్ళి మాట్లాడాలంటా, ఆందుకు ఒప్పుకొకపొయెసరికి, తన తలను స్విచ్ బోర్డ్ కేసి కొట్టుకున్నాడు. ఆది పగిలి పెంకులు మోహనికి గుచ్చుకున్నాయి.


(ఇంకా ఉంది...)

     


Monday, 13 October 2014

What is Your Blood Group

 
what's your blood type?
మీ Blood Group ఏంటో మీకు తెలుసా....!


ఎందుకు అంటారా సరదాగా ఉండే postను చివరివరకు చూడండి మీకే అర్దం అవుతుంది.
.
.
.

Blood Group A,B,O మరియు AB లను ఒక గదిలో ఉంచేతే వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది.



వీరికి ఒక painting ఇచ్చి, గోడకు మేకులు కొట్టి తగిలించమంటే...





Friday, 25 April 2014

suicide (ఆత్మహత్య)


        ఒక రోజు రాత్రి సమయలో friend ని కలుద్దాం అని, తన room కి వెళ్ళాను. తనువుండేది 1st floorలో. కొంత సేపటికీ కింద (ground floor) ఉన్న aunty పెద్దగా అరుస్తుంది "బాబు మీ uncle మెడ మీదకు పరిగెత్తుతున్నాడు, పట్టుకోండి" అని. ఆ అరుపు విని, ఏమి జరుగుతుందో అర్దం కాని అయోమయంలో, నేను నా స్నేహితుడు మేడ మీదకు పరిగెత్తము.

       మేడ ఎక్కెసరికి, uncle పిట్టగొడ ఎక్కి దానికి ఉన్న pole పట్టుకొని, దూకటానికి రెడీ అవుతున్నాడు. ఆ situation చూడగానే నా పరిస్తితి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయ్యింది. తనను పట్టుకుందాం అని పరిగెత్తె హడావుడిలో, అడ్డుగా ఉన్న కర్ర తట్తుకొని బొక్కాబోర్లా పడ్డాను. ఇంతలో స్నేహితుడు, uncle ని పట్టుకొని సంకలో పెట్టుకున్నాడు (uncle బక్క ప్రాణిలెండి). సంకలో పెట్టుకున్న మెకపిల్లలా, uncle గిలగిలా కొట్టుకుంటూ, "నన్ను వదలండి నేను దూకాలి" అంటున్నాడు.

       అసలు ఏమీ జరిగింది అని ఆరా తీస్తే తెలిసింది ఏంటి అంటే... Uncleకి తాగుడు అలవాటు ఉంది. తాగి వచ్చి aunty ని కొట్టేవాడు. బలంగా ఉండే aunty కి ఓరోజు కోపంవచ్చి బక్కగా ఉండే uncle ని ఒక్కటి ఇచ్చింది. ఆదెబ్బకు గోడకు బల్లిలా కరుచుకున్నాడు. తరువాత నుంచి పెల్లాన్ని కొట్టటానికి భయం వేసి. పక్క బిల్డింగ్ లో ఉంటున్న తన అక్కను కొట్టటం (బావ లేని సమయం చూసి) మొదులు పెట్టాడు.


       ఈ విషయం బావకు తెలిసింది. బావమరిదికి బుద్ది చెప్పాలి అని. మన police మామలకు మామూలు ఇచ్చి, ఒక గంట సేపు బావమరిదిని stationలో కూర్చోబెట్టమన్నాడు. మామలు చెప్పినట్టు చేశారు.


       ఇంకెముంది మన uncle అవమానం తట్టుకోలేక, ఇంటికి వచ్చి gas లీక్ చెయ్యటానికి try చేశాడు. బలమైన పెళ్ళాం ముందు తన బలం సరిపోక, మన బక్క uncle, aunty కి దొరకకుండా మేడ మీదకి పరిగెత్తాడు.

Tuesday, 8 April 2014

Marriage Looks (పెళ్ళి చూపులు)


       పెళ్ళి అంటే కొందరికి ఇష్టం, కొందరికి కష్టం, మరికొందరికి భయం. ఏది ఏమైతేనేమి జీవితం సంపూర్నాం అవ్వాలి అంటే, సంసార సాగరం ఈదక తప్పదు.
 
       పెళ్ళి చూపూపు అనగానే, పెళ్లిడుకు వచ్చిన అబ్బాయి లేక అమ్మాయి ల మదిలో తెలియని అలజడి మొదలవుతుంది, ముఖంలో చిరునవ్వుల పూవులు వీరబుస్తాయి. కుటుంభ సమేతంగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం. అమ్మాయిని చూడటం, కొన్ని సమాధానాలు అడగటం. ఇరు కుటుంభాలు సభ్యులు మాట్లాడుకోవటం..... ఇలా జరిగి పోతుండేవి.

       బ్రిటీష్ వాడు వదిలి వెళ్ళిన అలవాట్లవల్ల, అమ్మాయిల కొరత వల్ల, పెళ్ళి చూపుల స్వరూపంమే మారిపోయినది. అబ్బాయిల పెరుగుదల, అమ్మాయిల కొరత వళ్ళ, అమ్మాయిలకు demand బాగా పెరిగిపోంది. దీనితో అరిగి పోయిన చెప్పులతో ఇంటి చుట్టూ తిరిగే పెళ్ళిళ్ల పేరయ్య, duplex house కట్టి, shed లో రెండు మూడు car's తో పాటు office building maintain చేస్తున్నాడు.

       నా స్నేహితుడు ఒకడు పెళ్ళిళ్ల పేరయ్యకి call చేశాడు. రేపు office time లో office కి రమ్మన్నాడు పేరయ్య. ఏమన్నా photos ఉంటే పంపమన్నాడు. Photos ఏమీ కర్మ, రేపు office కి వచ్చెయ్ direct గా అమ్మాయిలనె చూపిస్తాను అన్నాడు.

       మవాడు నీటిగా రెడీఐ వెళ్లాడు. Office super గా ఉందట, వెళ్ళగానే ఓక్ వెయ్యి రూపాయలు గుంజి (consulting fee) ఒక రూమ్‌లో కూర్చుబెట్టాడు. మావడు అమ్మాయి ఎలా ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. ఇంత లో door sound అయ్యింది, అమ్మాయి వస్తుంది అని ఆతృతగా చూడ సాగడు, కానీ వచ్చింది ఒక పెద్దాయన. తనను ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. ఏంటి అతను అలా చూసి వెళుతున్నాడు అనుకునే లోపే ఇంకొక అతను వచ్చి చూసి వెళ్లాడు.

      మవాడికి అసలు ఏమీ జరుగుతుందో అర్దమై ఛస్తే కదూ...!. అదే విషయం బయటకు వెళ్ళిల పేరయ్యను అడిగాడు. వాల్లా...! పిల్లల తండ్రులు, నువ్వు వాళ్ళకు నచ్చితే, మనం వెళ్ళి అమ్మాయిని చూడవచ్చు అన్నాడు. ఆ మాట వినగానే మవాడికి పిచ్చ కోపం వచ్చింది. బండ బూతులు నోటిదాకా వచ్చి ఆగిపోయాయి, ఎందుకంటే తిడితే పేరయ్య తన గురించి చెడు ప్రచారం చేస్తాడేమొ అని అసలే పిల్లలు దొరకడం కష్టంగా ఉంది.

      First round clear అయ్యింది second round కి రమ్మని పేరయ్య నుంచి call వచ్చిందండోయ్. ఆ పేరయ్యదగ్గరకు వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్లాడు. పేరయ్య 500 లాక్కోని (consulting fee) , ఒక AC car తీసుకు రా మంచి hotel కి వెళ్ళి తిని, అమ్మాయిని చూడ్డానికి వెలుదాము అన్నాడు. మావాడు shock నుంచి తేరుకొని, వాడు చెప్పినట్టు చేశాడు. అమ్మాయిని చూడగానే మవాడికి ఏడుపు ఒక్కటే కొరవ. బయటికి రాగానే పేరయ్యను తిట్టిన తిట్టూ తిట్టకుండా తిట్టాడు.

      తిట్లు మనకు కొత్త కానీ పేరయ్యకు కాదుకదా. మవాడు తిట్టటం ఐపోగానే. ఈ అమ్మాయిని నేను సరిగా చూడలేదు బాబు, చూసి ఉంటే నిన్ను తీసుకు వచ్చే వాడిని కాదు. Next week రా నీకు కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తాను అన్నాడు.

      అప్పటికీ కానీ అర్దం కాలేదు పేరయ్య duplex house ఎలా కట్టాడో. పేరయ్యను నమ్మితే ఆస్తులు అమ్మినా పిల్ల దొరకదని, భందువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో జీవితం సాఫీగా నెట్టుకోస్తున్నాడు.


Saturday, 5 April 2014

Marriage, Love (పెళ్ళి, ప్రేమ)



పెళ్ళి, ప్రేమ:

         పెళ్ళి అనేది మన దేశంలో అతి పవిత్రమైన భందం. ఇద్దరి మద్య ప్రేమ అనురాగాలతో పాటు, రెండు కుటుంబాలను కలుపుతుంది పెళ్ళి.

         ప్రేమ అనేది మదురమైనది భావన. ఇది ఇద్దరి వ్యక్తులనే కాదు, రెండు దేశాను సైతం కలపగలదు. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ అనేది తల్లి పిల్లల మద్య, మిత్రుల మద్య, భందువుల... ఇలా ఎవరిమద్యనైనా ఏర్పడవచ్చు.


        ఒకప్పుడు ప్రేమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది, తల్లి ప్రేమో,మిత్రుల ప్రేమో లేక భందువుల ప్రేమో. కానీ ఈ రోజులలో ప్రేమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది "ఒక అబ్బాయి మరియు అమ్మాయిల మద్య ప్రేమే". ప్రేమ అనే పదం వింటే కుర్రాళ్ళ గుండెలో తీయని ఉూహాలు మెదులుతాయి, అదే పెద్దవాళ్ళ గుండెలో ఐతే రైళ్ళు పరిగెత్తుతాయి.

ఇలా జరగటానికి కారణం మారుతున్న మన జీవనశైలే:

మన పెద్దల కాలం   ఈరోజుల్లో
1.      ఆటపాటలు, పెళ్ళి, సంపాదన (వ్యవసాయం) మరియు వంశం అభివృద్ది (పిల్లలు), పిల్లల పెళ్ళిళ్ళు. 1.     చదువు, సంపాదన (Job), సొంత ఇల్లు, కారు, పెళ్ళి. మరి వంశం అభివృద్ది అంటారా వీలైతే ఒకరు, వారి పెళ్ళి
2.     పుట్టినప్పటినుంచి పెళ్ళిడు వచ్చే వరకు
 ఆటపాటలే. 
 2.     ఆటపాటల సంగతి ఏమో కానీ చదువు మొదలైనప్పటి నుంచి సంవచ్చరానికొ exam pass అవ్వాలి. తరువాత Job కొత్టాలి. ఈ లోపు పెళ్లీడు వచ్చి పోనేపోతుంది.
3.      ఆటపాటలు ఆపి సంపాదనలో పడతాడు అని పెళ్ళి చేసేవారు. 3.      సంపాదనలో పడతే కానీ పిల్లని ఇచ్చే పరిస్తితి లేదు.
4.      తనకు పెళ్లీడు వచ్చింది అని తెలిసేలోపే తనకు పెళ్ళి ఐపోయేది. ఒక వేల ఒక సంవచ్చరం లేటు ఐనది అంటే, ఉూరిలో గుసగుసలు మరియు బెండకాయ సామెతలు మొదలవుతాయి.  4.     Job లో కుదురుకొనే సరికి 30 వస్తుంది. ఇంట్లో వాల్లేమో, ఆ...! అప్పుడే పెళ్ళి ఏంటి మావాడు చిన్న పిళ్లాడు ఐతేనూ...! అంటారు.
 5.     పిల్లల పెళ్ళి, మనవళ్ళ పెళ్ళి, ముదిమనవళ్ళ పెళ్ళి కూడా చూసేవాళ్ళు. 5.      పిల్లల పెళ్ళి వరకు ఐతే ఓకే, మరి మనవళ్ళ పెళ్ళి?


          ఏముందండి మన పెద్దల కాలంలో మనుషుల మద్య ప్రేమ, అభిమానం ఆప్యాయతలు ఉండేవి. వీటితో పాటు ఏవయసులో జరుగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగేది.

         ఈరోజుల్లో మనుషుల మద్య ఉన్నది పోటీ, స్వార్ధం. ఈ పోటీ ప్రపంచంలో జీవితం యాంత్రికం ఐపోయింది. నిద్ర లేచినప్పటి నుండి ఉరుకులు పరుగు. ఈ పరుగులలో పెళ్ళి విషయం ఐతే అసలు గుర్తుకే రావటంలేదు (30 సం వచ్చే వరకు). పెళ్ళి కొంచెం వెనక్కు జరిగింది (18 సం నుంచి 30 సం కు), ప్రేమ ముందుకు వచ్చింది.

         అందుకే వీలైతే ప్రేమ వివాహాలు, లేకుంటే ప్రేమ ఆత్మహత్యలు. ప్రెమొన్మోదులు, ప్రేమ హత్యలు........ ప్రేమ,ప్రేమ,ప్రేమ .....