ఓ రోజు (Oct-2014) రాత్రి TV చూస్తూ ఉన్నాను, టైమ్ చూసేసరిసి 11:30 అయ్యింది. TV off చేసి పడుకున్నను. అప్పుడు మేడ పైనుంచి పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి. అవి f..k u, f....f..., Kill you, మరియు గట్టిగా door వేస్తున్న శబ్దం.
బిల్డింగ్ లో రెండు floor లు ఉన్నాయి (Ground floor and first floor) నేను first floor లో ఉంటాను. మేడ మీద సింగల్ రూమ్ ఉంది. అందులో ఒకతను ఉంటాడు(bachelor) తన పేరు మార్క్., call-center లో పనిచేస్తున్నాడు, ఇంగ్లీష్ తప్ప వేరే బాష రాదు. తనకు Ground floor లో ఉండే ఒక family లోని రోహిత్ తో పరిచయం (ఫ్రెండ్) ఉంది.
ఆ అరుపులు విని నేను బయటకు వచ్చాను. పక్కింటి వాల్లుకూడా బయటకు వచ్చారు. ఏమి జరుగుతుందా అని మేము మెడ మీదకు వెళ్ళాము. మార్క్ ఏమో బిల్డింగ్ పైకి ఎక్కి పిట్ట గోడకు ఆనుకొని ఉన్నాడు. తన ఫ్రెండ్ రోహిత్ room బయట ఉన్నాడు, room లో ఒక అమ్మాయి ఉంది.
ఏంటి గొడవ అని రోహిత్ ని అడిగాను. దానికి బదులుగా ఫ్యామిలీ ప్రాబ్లమ్ అని సమాదానం ఇచ్చాడు. ఆ సమాదానం విని నాకు మైండ్ పోంది (విడెబ్బ వీడికి పెళ్ళి కాకుడాం ఫ్యామిలీ ఎలావాచ్చిందా అని). పిట్ట గోడకు ఆనుకొని ఉన్న మార్క్ ని చూస్తుంటే కింద పడిపోయేలా ఉన్నాడు, నీ దుంప తెగ కిందకు రారా అంటే ఎంతకూ రాడే. ఎంత కోపంగా అరిసిన తనకు చీమ కుట్టినట్టు కూడా లేదు (సీతయ్య సినిమా చూపించాడు). చివరకు రోహిత్ వాళ్ళ నాన్న వచ్చి అరిస్తే కానీ వినపడలేదు సీతయ్యకి. మార్క్ కిందకు వస్తూనే పెద్దగా అరుస్తూ మొదలెట్టాడు బూతు పురాణం (f..king lady lefty me in the middle of the MG road.... i will kill her....), అందరూ ఉన్నారు అన్న ఇంకిట జ్ఞానం లేకుండా. అప్పుడు కానీ అర్దం కాలేదు మాకు మన గురుడు drugs తీసుకున్నాడు అని.
అసలు ఏమి జరిగిందా అని ఆరా తీస్తే, Room లో ఉన్న అమ్మాయి(మేరీ) మన సీతయ్య(మార్క్) లవర్. ఇద్దరూ కలసి పబ్ కి వెళ్లారు, అక్కడ ఇద్దరకు గొడవ జరిగింది. సీతయ్యకు శివాలెత్తి మేరీ ని కొట్టాడు. అంతే మేరీ కోపంతో అక్కడనుంచి ఒక్కటే రూమ్ కి వచ్చింది. తనను వదిలి ఒక్కటే వచ్చింది అని, మార్క్ శివ తాండవం చేస్తున్నాడు.
Room లో ఉన్న మేరీ, బయట జరుగుతున్న గొడవకు బయపడి bag తీసుకుని కిందకి వెళ్ళి పోంది. తన కోసం మార్క్ వెళ్లాడు. అంతే పంచాయతి రోడ్ కి ఎక్కింది. చుట్టుపక్కలవాళ్లు మెడ మీదనుంచి చూస్తున్నారు అప్పటికీ నైట్ 12:30 అయ్యింది. మార్క్ మేరీ ని ఆపటానికి try చేస్తున్నాడు, తను వినిపించుకోవటంలేదు. Sorry మేరీ నీకు కోపంగా ఉంటే నన్ను కొట్టు. beat me, beat me, ....... beat me అంటూ. మేరీ కోపంతో, పోకిరీ మూవీ లో మహేష్ బాబులా ఒక్కటిఇచ్చింది. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి కింద పడబోయి తామాయిన్చుకున్న మార్క్. మళ్ళీ మొదలెట్టాడు, common beat me, beat me...అంటూ (మేరీ చెయ్యి తీసుకొని తన చెంప మీది కొట్టుకుంటూ).
అది చూస్తున్న మాకు ఏమి చెయ్యాలో అర్దం కాక ఒకరి మొకం ఒకరం చూసుకుని నవుుకున్నాం. మార్క్ ప్రవర్తన ఎలాఉందంటే సైకో అంటే ఇలానే ఉంటాదేమో అనిపించింది మాకు. రోడ్ లో ఏంటి మీగోడవ అందరు చూస్తున్నారు అనెసరికి వాళ్ళు మెడపైకి వెళ్ళడానికి ప్రయత్నిచారు. మేడమీదకి వెళితే మన సైకో ఆ అమ్మాయిని ఏమి చేస్తాడో అని, మేము వెళ్లనివ్వకుండా ఈ రాత్రికి రోహిత్ వాళ్ల ఇంట్లో ఉండమన్నము (అక్కడ ఐతే అందరూ ఉంటారు అని). అందుకు మార్క్ ససేమిరా ఒప్పుకోలేదు. బలవంతంగా ఇద్దరిని రోహిత్ ఇంట్లోకి పంపి, హమ్మయ్య గొడవ సద్దుమణిగింది అని మేము వెళ్ళిపోయాము.
ఇంటి డోర్ పెట్టి పడుకోబొతున్నాను, ఇంతలో పెద్ద శబ్దం మరియు అరుపులు. ఏమి జరుగుతుందా అని పరుగు పరుగున రోహిత్ వాళ్ళ ఇంటివైపు వెళ్ళాను. అందరు నుంచుని చూస్తున్నారు, ఏమి జరిగిందా అని ఇంట్లోకి వెళ్ళి చూశాను. మార్క్ నిలబడి ఉన్నాడు, మొహం అంతా నెత్తురు కారుతుంది. మేరీని మేడమీదకు తీసుకొని వెళ్ళి మాట్లాడాలంటా, ఆందుకు ఒప్పుకొకపొయెసరికి, తన తలను స్విచ్ బోర్డ్ కేసి కొట్టుకున్నాడు. ఆది పగిలి పెంకులు మోహనికి గుచ్చుకున్నాయి.
(ఇంకా ఉంది...)

No comments:
Post a Comment