Saturday, 5 April 2014

Marriage, Love (పెళ్ళి, ప్రేమ)



పెళ్ళి, ప్రేమ:

         పెళ్ళి అనేది మన దేశంలో అతి పవిత్రమైన భందం. ఇద్దరి మద్య ప్రేమ అనురాగాలతో పాటు, రెండు కుటుంబాలను కలుపుతుంది పెళ్ళి.

         ప్రేమ అనేది మదురమైనది భావన. ఇది ఇద్దరి వ్యక్తులనే కాదు, రెండు దేశాను సైతం కలపగలదు. ప్రేమకు హద్దులు లేవు. ప్రేమ అనేది తల్లి పిల్లల మద్య, మిత్రుల మద్య, భందువుల... ఇలా ఎవరిమద్యనైనా ఏర్పడవచ్చు.


        ఒకప్పుడు ప్రేమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది, తల్లి ప్రేమో,మిత్రుల ప్రేమో లేక భందువుల ప్రేమో. కానీ ఈ రోజులలో ప్రేమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది "ఒక అబ్బాయి మరియు అమ్మాయిల మద్య ప్రేమే". ప్రేమ అనే పదం వింటే కుర్రాళ్ళ గుండెలో తీయని ఉూహాలు మెదులుతాయి, అదే పెద్దవాళ్ళ గుండెలో ఐతే రైళ్ళు పరిగెత్తుతాయి.

ఇలా జరగటానికి కారణం మారుతున్న మన జీవనశైలే:

మన పెద్దల కాలం   ఈరోజుల్లో
1.      ఆటపాటలు, పెళ్ళి, సంపాదన (వ్యవసాయం) మరియు వంశం అభివృద్ది (పిల్లలు), పిల్లల పెళ్ళిళ్ళు. 1.     చదువు, సంపాదన (Job), సొంత ఇల్లు, కారు, పెళ్ళి. మరి వంశం అభివృద్ది అంటారా వీలైతే ఒకరు, వారి పెళ్ళి
2.     పుట్టినప్పటినుంచి పెళ్ళిడు వచ్చే వరకు
 ఆటపాటలే. 
 2.     ఆటపాటల సంగతి ఏమో కానీ చదువు మొదలైనప్పటి నుంచి సంవచ్చరానికొ exam pass అవ్వాలి. తరువాత Job కొత్టాలి. ఈ లోపు పెళ్లీడు వచ్చి పోనేపోతుంది.
3.      ఆటపాటలు ఆపి సంపాదనలో పడతాడు అని పెళ్ళి చేసేవారు. 3.      సంపాదనలో పడతే కానీ పిల్లని ఇచ్చే పరిస్తితి లేదు.
4.      తనకు పెళ్లీడు వచ్చింది అని తెలిసేలోపే తనకు పెళ్ళి ఐపోయేది. ఒక వేల ఒక సంవచ్చరం లేటు ఐనది అంటే, ఉూరిలో గుసగుసలు మరియు బెండకాయ సామెతలు మొదలవుతాయి.  4.     Job లో కుదురుకొనే సరికి 30 వస్తుంది. ఇంట్లో వాల్లేమో, ఆ...! అప్పుడే పెళ్ళి ఏంటి మావాడు చిన్న పిళ్లాడు ఐతేనూ...! అంటారు.
 5.     పిల్లల పెళ్ళి, మనవళ్ళ పెళ్ళి, ముదిమనవళ్ళ పెళ్ళి కూడా చూసేవాళ్ళు. 5.      పిల్లల పెళ్ళి వరకు ఐతే ఓకే, మరి మనవళ్ళ పెళ్ళి?


          ఏముందండి మన పెద్దల కాలంలో మనుషుల మద్య ప్రేమ, అభిమానం ఆప్యాయతలు ఉండేవి. వీటితో పాటు ఏవయసులో జరుగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగేది.

         ఈరోజుల్లో మనుషుల మద్య ఉన్నది పోటీ, స్వార్ధం. ఈ పోటీ ప్రపంచంలో జీవితం యాంత్రికం ఐపోయింది. నిద్ర లేచినప్పటి నుండి ఉరుకులు పరుగు. ఈ పరుగులలో పెళ్ళి విషయం ఐతే అసలు గుర్తుకే రావటంలేదు (30 సం వచ్చే వరకు). పెళ్ళి కొంచెం వెనక్కు జరిగింది (18 సం నుంచి 30 సం కు), ప్రేమ ముందుకు వచ్చింది.

         అందుకే వీలైతే ప్రేమ వివాహాలు, లేకుంటే ప్రేమ ఆత్మహత్యలు. ప్రెమొన్మోదులు, ప్రేమ హత్యలు........ ప్రేమ,ప్రేమ,ప్రేమ .....

No comments:

Post a Comment